Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై దర్యాప్తు

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై దర్యాప్తు

Jubilee Hills Rape Case

Updated On : June 6, 2022 / 9:18 AM IST

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఒక కార్పొరేటర్ ప్రయత్నించినట్లు వార్తలు రావడంతో దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయ నాయకుడికి చెందిన ఫామ్‌హౌజ్‌ నుంచి నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంలో బాధితురాలికి సంబంధించిన కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. కారు నుంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్లూస్ టీమ్ సేకరించింది.

Police Torture: పోలీసుల అమానుషం.. వ్యక్తిపై దాడి.. చచ్చుబడ్డ కాళ్లు

ఫోన్ సీడీఆర్, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారనుంది. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. వీడియోలు సర్క్యులేట్ చేస్తున్న సుభాని అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. బీజేపీ నేతలు వీడియో విడుదల చేసిన అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.