Police Torture: పోలీసుల అమానుషం.. వ్యక్తిపై దాడి.. చచ్చుబడ్డ కాళ్లు
ఒకవైపు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చెబుతున్నా అది అమలు కావడం లేదు. ఇది మాటలకే పరిమితమవుతోంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం.

Police
Police Torture: ఒకవైపు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చెబుతున్నా అది అమలు కావడం లేదు. ఇది మాటలకే పరిమితమవుతోంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఒక బైక్ వివాదానికి సంబంధించి జిమ్ ట్రైనర్ సూర్యపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పెట్రోలింగ్‌లో ఉన్న నలుగురు పోలీసులు సూర్య దగ్గరికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిచారు. అర్ధరాత్రి తాను రాలేనని సూర్య చెప్పడంతో అతడిపై అమానుషంగా ప్రవర్తించారు.
Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా
బూటు కాళ్లతో తన్నుతూ, కర్రతో దాడి చేసి కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సూర్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసుల దెబ్బలకు సూర్య కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సూర్యపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.