Jubilee Hills Rape Case: దోషులను రక్షించేందుకు పోలీసుల యత్నం: బీజేపీ నేత తరుణ్ చుగ్
బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tarun Chugh
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ‘‘బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు
కేసీఆర్ ఎలా చెబితే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే పనిచేసే కొంతమంది పోలీసులు ఉన్నారు. ఆ కుటుంబం కోసం కాకుండా, ప్రజల కోసం పోలీసులు పనిచేయాలి. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలి. ఈ కేసులో న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుంది’’ అని తరుణ్ చుగ్ అన్నారు.