Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు

నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు

Jubilee Hills Rape Case

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యచార ఘటనలో పోలీసు కస్టడీలో సాగే నిందితుడి విచారణ కీలకం కానుంది.

Jubilee Hills Rape Case: ఇంటిదగ్గర దింపుతామని.. ట్రాప్ చేసి.. బాధితురాలు వెల్లడి

నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తారు. దీనిలో భాగంగా అమ్నేషియా పబ్, కాన్ సీ యూ బేకరితోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్తారు. నేరం చేసిన తర్వాత ఇన్నోవా కారును దాచిపెట్టిన ప్రదేశానికి కూడా తీసుకెళ్తారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన నిందితులు ఎక్కువ మంది మైనర్లే కావడంతో, వాళ్లకు ప్రభుత్వ వైద్యులతో లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహిస్తారు. చార్జిషీటు దాఖలుకు ఈ పరీక్ష కీలకం కావడంతో దీనికి కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగే అత్యాచార ఘటనలో వాడిన ఇన్నోవా కారులో సాక్ష్యాలను తారుమారు చేశారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Free Raiton: ఈ నెల నుంచి తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

ట్రయల్ సమయంలో ఈ కేసులో నిందితులను మేజర్‌లుగా గుర్తించాలని పోలీసులు.. జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత ఐదుగురిని మేజర్‌లుగా పరిగణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనిపై చట్టపరంగా జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. మైనర్ల మానసిక స్థితి, నేరం చేసేందుకు వాళ్లకు ఉన్న సామర్ధ్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలిస్తారు.