Jubilee Hills Rape Case: ఇంటిదగ్గర దింపుతామని.. ట్రాప్ చేసి.. బాధితురాలు వెల్లడి

ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.

Jubilee Hills Rape Case: ఇంటిదగ్గర దింపుతామని.. ట్రాప్ చేసి.. బాధితురాలు వెల్లడి

Rape Case

Jubilee Hills Rape Case: ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు. నిందితులే తనను బలవంతం చేసినట్లు బాలిక చెప్పింది. 10టీవీకి ఈ స్టేట్‌మెంట్‌ వివరాలు చేరాయి. బాలిక స్టేట్‌మెంట్‌ ప్రకారం.. పబ్ లోపల ఉన్న బాలిక స్నేహితురాలు బయటకు వచ్చి, క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లింది. అత్యాచారానికి గురైన బాలికను పబ్‌కు తీసుకొచ్చిన వ్యక్తి పబ్ లోపలే ఉన్నాడు. బాధిత బాలిక బయటకు వచ్చినప్పుడు నిందితులు తనను ఫాలో అవుతూ బయటకు వచ్చారు. క్యాబ్ బుక్ చేస్తామని చెప్పి బాలిక ఫోన్ లాక్కున్నారు. ఫోన్లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదని, తామే ఇంటి దగ్గర దిగబెడతామని బాలికను బెంజ్ కారులో ఎక్కించుకున్నారు.

Free Raiton: ఈ నెల నుంచి తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

తర్వాత కారులో పబ్ నుంచి బంజారాహిల్స్‌లోని కాన్స్ బేకరి వరకు వెళ్లారు. ఆలోపే నిందితులు, బాధితురాలి దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారు. ఆ సమయంలోనే బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించారు. కాన్స్ బేకరి వద్దకు రాగానే, బెంజ్ కారు ఇరుకుగా ఉందంటూ ఇన్నోవాలోకి ఎక్కించుకున్నారు. తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు ఇస్తారేమోనని ఇన్నోవా కారులోకి ఎక్కిన బాధితురాలు. ఇన్నోవా కారులోనే నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.