Home » nitish kumar govt
బీహార్ కుల గణనకు సంబంధించి 36 శాతం అత్యంత వెనుకబడిన వారి సంఖ్య వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఈ 36 శాతం మందికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా మరెవరు అధికారంలో ఉన్నా వెనుకబడిన తరగతులను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని మండపడ్డారు
బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, రాష్ట్ర మొత్తం జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (OBC), అత్యంత వెనుకబడిన తరగతుల (EBC) వాటా 63 శాతం. రాష్ట్ర మొత్తం జనాభా 13.07 కోట్లు. ఇందులో EBC (36 శాతం) అతిపెద్ద సామాజిక వర్గం, OBC (27.13 శాతం) తర్వాతి స్థానంలో ఉంది.
కుల గణన డేటా చాలా వరకు అంచనాల ప్రకారం వచ్చింది. ఇది అభివృద్ధి చెందిన కులాలకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వెనుకబడిన, ఇతర వెనుకబడిన కులాలకు ఈ సంఖ్య ఒక కంఫర్ట్‌గా ఉంది.
214 కులాలు కాకుండా ఇతర కులాలను కూడా 215 నంబర్‌గా నివేదికలో పేర్కొన్నారు. లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 13,07,25,310 మంది. సర్వే చేసిన మొత్తం కుటుంబాల సంఖ్య 2,83,44,107. ఇందులో మొత్తం పురుషుల సంఖ్య 6.41 లక్షలు కాగా, మహిళల సంఖ్య 6.11 లక్షలు
బీహార్‌లో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. వీరి సంఖ్య 10,71,92,958 మంది. ఇక ముస్లింల సంఖ్య 2,31,49,925 మంది ఉండగా క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కుల సంఖ్య 14,753, బౌద్ధుల సంఖ్య 1,11,201, జైనుల సంఖ్య 12,523 మంది ఉన్నారు.
బీహార్‌లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్‌లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది.