Bihar Caste Survey: బిహార్‌లో ఆ ఒక్క కులం తలుచుకుంటే రాజకీయాలు తలకిందులవుతాయి.. కులగణనలో ఆసక్తికర ఫలితాలు
కుల గణన డేటా చాలా వరకు అంచనాల ప్రకారం వచ్చింది. ఇది అభివృద్ధి చెందిన కులాలకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వెనుకబడిన, ఇతర వెనుకబడిన కులాలకు ఈ సంఖ్య ఒక కంఫర్ట్‌గా ఉంది.

Bihar Caste Survey Out: నితీశ్ కుమార్ ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ అయిన కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఫలితాలు సోమవారం వెల్లడించారు. బిహార్ ప్రభుత్వం ఈ నివేదికను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. బీహార్‌లో జనరల్ కేటగిరీ ప్రజల జనాభా 15 శాతం. వెనుకబడిన తరగతుల జనాభా 27 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ కులాల జనాభా 20 శాతం. సోమవారం బీహార్ ప్రభుత్వ ఇన్‌ఛార్జ్ చీఫ్ సెక్రటరీ వివేక్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గణాంకాల బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
బిహార్‌లో ఎక్కువ మంది యాదవులదే
కుల గణన డేటా చాలా వరకు అంచనాల ప్రకారం వచ్చింది. ఇది అభివృద్ధి చెందిన కులాలకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వెనుకబడిన, ఇతర వెనుకబడిన కులాలకు ఈ సంఖ్య ఒక కంఫర్ట్‌గా ఉంది. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కులానికి చెందిన వారి సంఖ్య బీహార్‌లోని సాధారణ వర్గానికి చెందిన వారి సంఖ్య దాదాపు సమానంగా ఉంది. బీహార్‌లో అత్యధికంగా 14.26% యాదవులు ఉన్నారు. బిహార్ రాజకీయాల్లో యాదవులు చాలా ప్రభావవంతంగానే ఉన్నారు. ఇక తాజా ఫలితాలతో వారు మరింత బలపడనున్నారు. నిజానికి.. యాదవులు తలుచుకుంటే బిహార్ రాజకీయం తలకిందులవుతుందని డేటా చెప్తోంది. యాదవుల తర్వాత, దుసద్ కులాల సంఖ్య 5.31% ఉంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ కులమే అన్ని విధాలుగా ఇక్కడ ముఖ్యమని గణాంకాలు చెబుతున్నాయి. రవిదాస్ వర్గానికి చెందిన వారి సంఖ్య 5.25 శాతంతో బీహార్‌లో మూడో స్థానంలో ఉంది.
బీహార్‌లో ఏ మతస్థుల జనాభా ఎంత?
హిందూ – 81.99% (10,71,92,958)
ముస్లింలు – 17.70% (2,31,49,925)
బౌద్ధులు – 0.0851% (1,11,201)
క్రైస్తవులు – 0.05% (75,238)
సిక్కు – 0.011% (14,753)
జైన్ – 0.0096%(12,523)
ఇతర మతాల జనాభా 0.1274% (1,66,566)
ఏ మతాన్ని అనుసరించని వారు – 0.0016% (2,146)
బీహార్‌లో ఏ వర్గం జనాభా ఎంత?
అత్యంత వెనుకబడిన తరగతి (EBC) – 36.1% (4,70,80,514)
వెనుకబడిన తరగతి (OBC) 27.12%-(3,54,63,936)
షెడ్యూల్డ్ కులం- 19.65% (2,56,89,820)
షెడ్యూల్డ్ తెగ – 1.68% (21,99,361)
రిజర్వ్ చేయని (జనరల్ కేటగిరీ) – 15.52% (2,02,91,679)