Home » Secunderabad
లష్కర్ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.
పోతురాజుల ఆటపాటలతో పాటు...అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడిన కేసులో నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును నేడు అరెస్ట్ చేసి రిమాండ్కు త�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నేడు, రేపు 20 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు 13 రైళ్ళు, రేపు 7 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు చెప్పింది.
ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.