BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం  కానుంది.

BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Modi Amit Shah

Updated On : July 3, 2022 / 4:52 PM IST

BJP National Executive Meeting :  హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం  కానుంది.  మోదీ  సభా  వేదిక వద్దకు  వచ్చే సరికి రాష్ట్ర నేతలు అందరూ ప్రసంగించేలా పార్టీ ఏర్పాట్లు చేసింది. మోదీ  వేదిక వద్దకు వచ్చిన తర్వాత పార్టీ జాతీయ అధ్యుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మాట్లడేలా ప్లాన్ చేసిన పార్టీ.  జేపీ నడ్డాకు 15 నిమిషాలు, బండి సంజయ్ కు 5 నిమిషాలు కేటాయించారు.

కాగా వేదిక మీద ప్రధాని మోదీకి ఎడమ పక్కన బండి సంజయ్, అమిత్ షా..పీయూష్ గోయల్, యోగి ఆదిత్య నాథ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాజసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. మోదీకి కుడివైపు జెపి నడ్డా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బస్వరాజు బొమ్మై, కె.లక్ష్మణ్, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు కూర్చోనున్నారు.

Also Read : Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య ?
రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో సంస్ధాగత. ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ అంశాలపై పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తెలంగాణాలోని రాజకీయ పరిస్ధితులపై బీజేపీ పేజీలతో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ నాయకులతో ప్రత్యేకంగ సమావేశం అయ్యారు.