Home » Sidhu Moose Wala
సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు.
పంజాబ్ సింగర్ మన్‌కీర్త్ ఔలక్, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దవిందర్ బంబిహా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే భద్రత పెంచాలని మన్‌కీర్త్ పంజాబ్ పోలీసులను కోరాడు.
సిద్ధూ మూస్ వాలా (అలియాస్) శుభదీప్ సింగ్ సిద్ధూ హత్యపై దర్యాప్తుకు పంజాబ్ సీఎం భగవత్ మన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
ప్రముఖ పంజాబీ సింగర్ "సిద్ధూ మూసీవాలా" కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్