Home » Sri Ramanuja millennium celebrations
ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు.
భగవత్ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజుల సహాస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.