Hyderabad : రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Hyderabad : రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad 11zon

Updated On : February 13, 2022 / 11:22 AM IST

Traffic restrictions : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించబోమని వెల్లడించారు. ఈ సమయంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అన్నారు.

ముచ్చింతల్ లో నేడు శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజచార్యుల బంగారు విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Yemen : ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్‌

మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్‌నాథ్ కోవింద్ దాదాపు రెండు గంటలపాటు గడపనున్నారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.

రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మహా పూర్ణాహుతితో పాటు భగవత్‌ రామానుజుల స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట, కుంభాబిషేకం నిర్వహించనున్నట్టు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ తెలిపారు. అలాగే రేపు సాయంత్రం 108 దివ్యదేశాల దేవతలకు శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.