Yemen : ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్‌

వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐక్యరాజ్యసమితి అధికారి రస్సెల్‌ గీకీ పేర్కొన్నారు. కాగా అంతర్యుద్ధంతో యెమెన్‌ అట్టుడుకుతోంది.

Yemen : ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్‌

Un (1)

UN Staff kidnapped : యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారు. పని ముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తున్న సిబ్బందిని దుండగులు కిడ్నాప్‌ చేశారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐక్యరాజ్యసమితి అధికారి రస్సెల్‌ గీకీ పేర్కొన్నారు. మరోవైపు అంతర్యుద్ధంతో యెమెన్‌ అట్టుడుకుతోంది. 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌కి మధ్య పోరు సాగుతోంది.

Tunnel Collapsed : మధ్యప్రదేశ్ లో కూలిన సొరంగం.. చిక్కుకుపోయిన కార్మికులు

2015లో యెమెన్‌లోని ప్రభుత్వాన్ని హౌతీలు కూల్చివేశారు. అప్పటి నుంచి రాజధాని సనాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 10 వేలకు పైగా మంది మృతి చెందారు. మరో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.