CM KCR : శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
భగవత్ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజుల సహాస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

Cm Kcr (3)
Sri Ramanuja millennium celebrations : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమాతామూర్తి ప్రాంగణాన్ని పరిశీలించారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అంతకముందు ముచ్చింతల్లో నిర్వహిస్తున్న సహస్రాబ్ది వేడుకలు ఒక సాహసమని.. ఎవరూ చేయలేరని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇవాళ ఆమె సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఒకేచోట 108 దివ్య దేవాలయాల నిర్మాణం.. ఒకే చోట దర్శనం చేసుకోవడం అదృష్టమన్నారు.
భగవత్ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజుల సహాస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మహాక్రతువులో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మి నారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. ఇందుకోసం యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రాన్ని తయారు చేశారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలను రాపిడి చేసి బాలాగ్నిని రగిలించారు. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాలకు తీసుకెళ్లారు. యాగశాలను 114 శాలలుగా విభజించి హోమాలను చేశారు. శ్రీరామనగరంలో నేలపై 5 వేల మంది రుత్వికులతో యాగం చేయడం ఇదే తొలిసారని వేద పండితులు చెబుతున్నారు.
Minister Talasani : దళిత, గిరిజన వర్గాలకు కేంద్రం ఏం చేసింది..? మంత్రి తలసాని
శ్రీశ్రీశ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అయోధ్య, నేపాల్,తమిళనాడు తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని జీయర్ స్వామలు హాజరై శ్రీలక్ష్మినారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. యాగశాలకు కుడివైపు భాగాన్ని శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా భోగ మండపం, మధ్య భాగాన్ని తిరుమల క్షేత్రానికి గుర్తుగా పుష్ప మండపం, వెనుక వైపు ఉన్న భాగాన్ని కాంచిపురానికి గుర్తుగా త్యాగ మండపం, ఎడమ వైపు ఉన్న మండపాన్ని మేలుకోట కేత్రంగా భావిస్తూ జ్ఞాన మండపంగా నామకరణం చేశామన్నారు చిన్నజీయర్ స్వామి.
యాగం వల్ల వెలువడే పొగ కార్బన్ డై యాక్సైడ్ కాదని, మన చూట్టూ ఉంటే కాలుష్యాన్ని, వ్యాధి కారకాలను తొలగించే పరమార్థమే ఈ మహా యాగమని శ్రీశ్రీశ్రీత్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఈ సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టిని చేస్తారు. ఆ తర్వాత గంటన్నరపాటు లక్ష్మినారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు జరుగనున్నాయి.