Home » TDP Janasena BJP Alliance
ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దాని పై త్వరగా స్పష్టత ఇస్తే అది పార్టీకి అనుకూలంగా ఉంటుందని, గెలుపు అవకాశాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.