Home » Twitter Down
#Twitter Down : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter)కు ఏమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ అయింది. గంటకు పైగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ట్విట్టర్ యూజర్లు సర్వీసులను యాక్సెస్ చేయలేకపోతున్నారు.
ట్విటర్ సేవలకు గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. సుమారు రెండుగంటల పాటు ట్విటర్ ఖాతా లాగిన్ సమస్య తలెత్తడంతో నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విటర్ ఖాతా సైన్ఇన్ కాకపోవటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విటర్ డౌన్ కావటం ఈ నెలలో రెండోసారి కావటం గమనార్హం. డిసెంబర్ 11న ట్విటర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సమస్య ఎదురైంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత సమస్య తలెత్తడం మూడోసారి.