Twitter Down : ట్విటర్ సేవలకు అంతరాయం.. మీమ్స్‌తో మస్క్‌ను ఆడుకున్న నెటిజన్లు.. నవ్వకుండా ఉండలేరు ..

ట్విటర్ సేవలకు గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. సుమారు రెండుగంటల పాటు ట్విటర్ ఖాతా లాగిన్ సమస్య తలెత్తడంతో నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విటర్ ఖాతా సైన్‌ఇన్ కాకపోవటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Twitter Down : ట్విటర్ సేవలకు అంతరాయం.. మీమ్స్‌తో మస్క్‌ను ఆడుకున్న నెటిజన్లు.. నవ్వకుండా ఉండలేరు ..

Twitter

Updated On : December 29, 2022 / 3:27 PM IST

Twitter Down : ట్విటర్ సేవలకు గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. సుమారు రెండుగంటల పాటు ట్విటర్ ఖాతా లాగిన్ సమస్య తలెత్తడంతో నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విటర్ ఖాతా సైన్‌ఇన్ కాకపోవటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అయితే, రెండు గంటల తరువాత మళ్లీ పునరుద్దరణ అయినప్పటికీ.. నెటిజన్లు మీమ్స్ తో చెలరేగిపోయారు. మస్క్ ట్విటర్ ను స్వాధీనం చేసుకున్న తరువాత ఇలా జరగడం మూడో సారి. డిసెంబర్ నెలలోనే ఇది రెండోసారి కావటం గమనార్హం. దీంతో పలు రకాల మీమ్స్ తో ట్విటర్ సీఈఓ మస్క్ పై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ చెక్కర్లు కొట్టాయి.