Twitter Down: ట్విటర్ డౌన్ .. లాగిన్ సమయంలో సమస్య.. మస్క్ హయాంలో మూడోసారి!

ట్విటర్ డౌన్ కావటం ఈ నెలలో రెండోసారి కావటం గమనార్హం. డిసెంబర్ 11న ట్విటర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సమస్య ఎదురైంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత సమస్య తలెత్తడం మూడోసారి.

Twitter Down: ట్విటర్ డౌన్ .. లాగిన్ సమయంలో సమస్య.. మస్క్ హయాంలో మూడోసారి!

Twitter Down

Updated On : December 29, 2022 / 8:53 AM IST

Twitter Down: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ గురువారం ఉదయం వెబ్ వెర్షన్‌లో సైన్‌ఇన్ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది యూజర్లు తమ అకౌంట్‌కు లాగిన్ కాలేకపోతున్నారు. ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు తొమ్మిది వేల మందికిపైగా వినియోగదారులు తమ సమస్యలను నివేదించారు. యూజర్ల వివరాల ప్రకారం.. లాగిన్ అయిన సమయంలో ఎర్రర్ సందేశాలు వస్తున్నాయని, లాగిన్‌పై క్లిక్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ కావటం లేదని తెలిపారు.

Twitter Personal Data : ట్విట్టర్‌ యూజర్లకు హెచ్చరిక.. మీ మొబైల్ నెంబర్ సేవ్ చేశారా? వెంటనే ఇలా డిలీట్ చేయండి.. లేదంటే అమ్మేస్తారు జాగ్రత్త..!

డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా సహా పలు నగరాల్లో ఈ సమస్య తలెత్తినట్లు ఆయా ప్రాంతాల యూజర్లు పేర్కొంటున్నారు. అయితే పలు ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారులకు ఈ సమస్య తలెత్తలేదు. ఇదిలాఉంటే.. ట్విటర్ డౌన్ కావటం ఈ నెలలో రెండోసారి కావటం గమనార్హం. డిసెంబర్ 11న ట్విటర్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సమస్య ఎదురైంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత సమస్య తలెత్తడం మూడోసారి.

Twitter Data Breach: ప్రమాదంలో ట్విట్టర్ యూజర్లు.. అమ్మకానికి 40 కోట్ల మంది డేటా!

ప్రస్తుతం ప్లే స్టోర్‌లో ఎటువంటి సమస్య లేనప్పటికీ , ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ట్విటర్ డౌన్ అవుతుందని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా సగానికిపైగా ఉద్యోగులను తొలగించిన విషయం విధితమే.