Twitter Data Breach: ప్రమాదంలో ట్విట్టర్ యూజర్లు.. అమ్మకానికి 40 కోట్ల మంది డేటా!

ఈ విషయమై సదరు హ్యాకర్ లిక్డ్‭ఇన్‭లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వద్ద డేటాబేస్ ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు సహా హై ప్రొఫైల్ యూజర్ల ప్రైవేటే సమాచారం ఉందని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గతంలో 54 లక్షల మంది డేటా దుర్వినియోగం అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి అది ఏకంగా తొమ్మిది రెట్ల మేరకు పెరగడం గమనార్హం

Twitter Data Breach: ప్రమాదంలో ట్విట్టర్ యూజర్లు.. అమ్మకానికి 40 కోట్ల మంది డేటా!

Twitter Data Breach: Hacker claims to have data of 400 million Twitter users for sale

Twitter Data Breach: సాంకేతికత ఎంత పెరుగుతోందో, సామాజిక భద్రత అంతే ప్రమాదంలో పడుతోంది. ముఖ్యమంత్రి సోషల్ మీడియాలోని డేటా తరుచూ దుర్వినియోగం అవుతోంది. ఈ విషయమై నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‭బుక్‭పై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉండేవి. ఈ జాబితాలో తాజాగా ట్విట్టర్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. కారణం, 40 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను ఒక హ్యాకర్ అమ్మకానికి పెట్టాడు. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ డేటా కూడా ఉన్నట్లు సదరు హ్యాకర్ పేర్కొన్నాడు.

Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

ఈ విషయమై సదరు హ్యాకర్ లిక్డ్‭ఇన్‭లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వద్ద డేటాబేస్ ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు సహా హై ప్రొఫైల్ యూజర్ల ప్రైవేటే సమాచారం ఉందని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గతంలో 54 లక్షల మంది డేటా దుర్వినియోగం అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి అది ఏకంగా తొమ్మిది రెట్ల మేరకు పెరగడం గమనార్హం. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది ఇంకా తెలియదు. ట్విట్టర్ నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ హ్యాకర్ చెప్పినట్లు నిజంగానే డేటా దుర్వినియోగం అయి ఉంటే చాలా ప్రమాదం పొంచి ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

#LetHerLearn: మహిళలకు విద్య నిషేధం.. తరగతులు బాయ్‭కాట్ చేసి మద్దతు తెలిపిన అఫ్గాన్‭ మగ విద్యార్థులు

అలోన్ గల్ అనే ఈ హ్యాకర్ తన పోస్టులో ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్‭ను ఉద్దేశించి రాస్తూ.. ‘‘డియర్ మస్క్, మీరు కనుక ఈ పోస్ట్ చదువుతున్నట్లైతే ఒక విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటికే 54 లక్షల యూజర్ల డేటా ఉల్లంఘనపై జీడీపీఆర్ జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక 40 కోట్ల మంది డేటా ఉల్లంఘనపై మీరు ఎంతటి జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఊహించుకోండి. ఫేస్‌బుక్ లాగే (డేటా ఉల్లంఘనలో 533 మిలియన్ డాలర్లు చెల్లించింది) జీడీపీఆర్ ఉల్లంఘనలోని 276 మిలియన్ డాలర్లు చెల్లించడం మీ ముందున్న ఐకైక మార్గం. అలా చేస్తే మీరు ఈ డేటాను పొందవచ్చు’’ అని పేర్కొన్నాడు.

MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు గాడ్సే వారసుల్ని కలవరపెడుతున్నాయి

హ్యాకర్ షేర్ చేసిన వివరాల్లో తన వద్ద డేటా ఉన్నట్లు వెల్లడిస్తున్న ప్రముఖ ఖాతాలు
అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్
స్పేస్ ఎక్స్
సీబీఎస్ మీడియా
డొనాల్డ్ ట్రంప్ జూనియర్
డోజా క్యాట్
చార్జీ పుత్
సుందర్ పిచాయ్
సల్మాన్ ఖాన్
నాసా యొక్క జేడబ్ల్యూఎస్‭టీ ఖాతా
ఎన్‭బీఏ
భారతదేశ సాంకేతిక, ప్రచార మంత్రిత్వ శాఖ
షాన్ మెండస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ సోషల్ మీడియా