Home » Vaccination
ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
భారత్లో కూడా కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందా? ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చా? ఈ విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఈ అంశంపై స్పందించాడు.
ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
కోవిడ్ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుక�
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక పక్క దేశంలో బూస్టర్ డోసులు తీసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. అర్హత కలిగిన దాదాపు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది.
యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.
శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.