Corona Cases : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 4,282 కేసులు నమోదు

ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.

Corona Cases : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 4,282 కేసులు నమోదు

Corona Cases (3)

Updated On : May 1, 2023 / 12:19 PM IST

Corona Cases : భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారంతో పోల్చుకుంటే పాజిటివ్ కేసులు తగ్గాయి. నిన్న (ఆదివారం) 5,874 కరోనా కేసులు నమోదు కాగా, 25 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 4,282 కేసులు నమోదు అయ్యాయి.

గత 24 గంటల్లో కరోనా బారిన పడి 14 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,282 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి.

ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,547 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.

Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

రికవరీ రేటు 98.71శాతంగా ఉంది. కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 220,66,66,433 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.