Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులోనే 20 వేల కేసులు నమోదు

యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.

Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులోనే 20 వేల కేసులు నమోదు

Covid 19

Updated On : July 17, 2022 / 12:04 PM IST

Covid-19: దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,528 కరోనా కేసులు నమోదయ్యాయి. 49 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,709. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 1,43,449 యాక్టివ్ కేసులున్నాయి.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ 200 కోట్లకు చేరుకోనుంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు 199.98 (1,99,98,89,097) కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. డైలీ పాజిటివిటీ రేటు 5.23 శాతం కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.55 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 17 మంది మరణించారు.

African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌లో ఆరుగురు, మహారాష్ట్రలో ఎనిమిది మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ బూస్టర్ డోసు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తున్న సంగతి తెలిసిందే.