African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తింపు

వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.

African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తింపు

African Swine Fever

African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇది పందులకు మాత్రమే సోకే అంటు వ్యాధి. అసోం, దిబ్రూగర్ జిల్లా, భోగాలి పథార్ అనే గ్రామంలోని పందులు ఈ వైరస్ బారిన పడ్డాయి. వెంటనే స్పందించిన జంతు సంరక్షణాధికారులు ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ప్రారంభించారు.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. వ్యాధి సోకిన పందుల నుంచి మిగతా పందులకు వ్యాపించకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఈ వ్యాధి మనుషులకు సోకదని, అయితే పందుల నుంచి పందులకు త్వరగా వ్యాపిస్తుందని అధికారులు అంటున్నారు. కొంతకాలంపాటు ప్రజలు పంది మాంసం తినకూడదని సూచిస్తున్నారు. అసోం, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, ఉత్తరాఖండ్, బిహార్, త్రిపురల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి.

Vaccination: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్

ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ కానీ, సరైన చికిత్సగానీ లేవు. 2020 నుంచి ఈ ఏడాది జూలై 11 వరకు దేశంలో 40,159 పందులు ఈ వ్యాధితో మరణించాయి. మరోవైపు ఈ వ్యాధిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వ్యాధిని అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి పందుల దిగుమతులు, ఎగుమతులు నిషేధించాయి.