Vaccination: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్

శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది.

Vaccination: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్

Vaccination

Vaccination: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని చేరుకోబోతుంది. త్వరలో 200 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవబోతుంది. శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది. జనవరి 16, 2021న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఫిబ్రవరి 2, 2021 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ అందించారు. అదే ఏడు మార్చి 1న సీనియర్ సిటిజన్స్‌కు, ఏప్రిల్ 1న 45 సంవత్సరాలు దాటిన వారికి, మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్టోబర్ 21 న వంద కోట్ల మార్కు దాటింది. ఈ ఏడాది జనవరి 3న 15-18 ఏళ్లు కలిగిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జనవరి 10 నుంచి బూస్టర్ డోసును ప్రారంభించారు.

IndiGo: హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం.. పాకిస్తాన్‍లో ల్యాండింగ్

అయితే, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే. మార్చి 16న 12-14 ఏళ్ల వయసు కలిగిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో భాగంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని.. అది కూడా ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత బూస్టర్ డోసుల కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభమైంది.