IndiGo: హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం.. పాకిస్తాన్‍లో ల్యాండింగ్

విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ రావాల్సిన ఇండిగో 6ఈ-1406 విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశాం. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని కరాచీ పంపుతున్నాం అని ఇండిగో సంస్థ ప్రకటించింది.

IndiGo: హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం.. పాకిస్తాన్‍లో ల్యాండింగ్

Indigo

IndiGo: షార్జా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో పాకిస్తాన్‌లోని కరాచీలో ల్యాండైంది. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించడంతో ఆదివారం ఉదయం ఈ విమానాన్ని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ‘‘విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ రావాల్సిన ఇండిగో 6ఈ-1406 విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశాం. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని కరాచీ పంపుతున్నాం’’ అని ఇండిగో సంస్థ ప్రకటించింది.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ సంస్థకు చెందిన విమానం కూడా కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సాంకేతిక లోపాలతో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావడం లేదా దారి మళ్లించడం వంటి ఘటనలు ఈమధ్య తరచూ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన విమానాన్ని జైపూర్ దారి మళ్లించారు.