Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

ఒక టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన వీళ్లు ఆ షోలోలాగా బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు. డబ్బులు తీసుకుని బాలుడ్ని వదిలిపెడదామనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదుగురు కలిసి ఎవరో ఒక బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

Teens Kill Boy

Teens Kill Boy: టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన ఐదుగురు విద్యార్థులు బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ నెల 9న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఇటీవల ఒక లావాదేవీ సందర్భంగా రూ.40 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ డబ్బు తిరిగి ఎలా భర్తీ చేయాలో అతడికి అర్థం కాలేదు. తన నలుగురు స్నేహితులకు ఈ విషయం చెప్పాడు.

Rashmika Mandanna : పొట్టి బట్టలతో మరోసారి ఇబ్బంది పడ్డ రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అందరూ కలిసి ఎలాగోలా నలభై వేల రూపాయలు సంపాదించాలనుకున్నారు. వీళ్లంతా 15, 16 ఏళ్ల వయసువారే. పదో తరగతి చదువుతున్నారు. అయితే, ఈ డబ్బు సంపాదించేందుకు ఒక ప్లాన్ వేశారు. ఒక టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన వీళ్లు ఆ షోలోలాగా బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు. డబ్బులు తీసుకుని బాలుడ్ని వదిలిపెడదామనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదుగురు కలిసి ఎవరో ఒక బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు. దీని కోసం ఒక నిందితుడు ఈ నెల 9న తను చదువుకునే స్కూల్‌కు తొందరగా వెళ్లాడు. అక్కడ ఒక బాలుడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు. స్కూళ్లో అప్పటికి ఎవరూ రాకపోవడంతో బాలుడ్ని దూరంగా లాక్కెళ్లాడు. అక్కడ మిగతా నలుగురు నిందితులు ఉన్నారు. వారు వేరే స్కూల్‌కు చెందిన వారు.

GST: వైద్య సేవలపై జీఎస్టీ తొలగించండి: కేంద్రానికి ఐఎమ్ఏ లేఖ

అక్కడ్నుంచి ఇద్దరు నిందితులు బాలుడ్ని బైక్‌పై ఎక్కించుకుని, అలీఘడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నిందితుడికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. బాలుడితో కలిపి ఇద్దరు నిందితులు ‌బైక్‌పై అలీఘడ్ చేరుకోగా, మిగతా ముగ్గురు బస్సులో అక్కడికి చేరుకున్నారు. తర్వాత ఇంట్లో బాలుడిని కట్టేశారు. అయితే, డబ్బులు డిమాండ్ చేస్తే తాము దొరికిపోతామేమోనని అనుమానం వచ్చింది. తమ ప్లాన్ వర్కవుట్ కాదేమోననిపించింది. దీనివల్ల తాము సమస్యల్లో ఇరుక్కుంటామని భావించిన నిందితులకు ఏం చేయాలో తోచలేదు. బాలుడ్ని చంపడం ఒక్కటే పరిష్కారం అని భావించారు. బాలుడి నోట్లో కర్చీఫ్ కుక్కి, అతడ్ని హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న నదిలో పడేశారు. మరోవైపు బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Lashkar Bonalu : ప్రారంభమైన లష్కర్‌ బోనాలు..ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. మరుసటి రోజు బాలుడి మృతదేహం నదిలో కనిపించింది. మిస్సైన బాలుడి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 100 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి, 200 మందిని విచారించారు. ఈ క్రమంలో ఐదుగురు నిందితులను కూడా పోలీసులు విచారించారు. మొదట తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, చివరకు నిజాన్ని అంగీకరించారు. ఐదుగురు నిందితుల్నిశనివారం అరెస్టు చేశారు.