GST: వైద్య సేవలపై జీఎస్టీ తొలగించండి: కేంద్రానికి ఐఎమ్ఏ లేఖ

ఇంతకుముందు ఈ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. కేంద్ర తాజా నిర్ణయంతో సోమవారం నుంచి ఈ సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. తాజా రూల్స్ ప్రకారం ఆసుపత్రుల్లో ఐసీయా కాకుండా రోజుకు రూ.5వేలు దాటిన రూమ్ రెంట్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తారు.

GST: వైద్య సేవలపై జీఎస్టీ తొలగించండి: కేంద్రానికి ఐఎమ్ఏ లేఖ

Gst

GST: వైద్య సేవలపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) కేంద్రానికి లేఖ రాసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వైద్య సేవలపై జీఎస్టీ విధించాలని నిర్ణయించారు.

Rainfall: దేశంలో 50 శాతం అదనపు వర్షపాతం నమోదు

ఇంతకుముందు ఈ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. అయితే, కేంద్ర తాజా నిర్ణయంతో సోమవారం (జూలై 18) నుంచి ఈ సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. తాజా రూల్స్ ప్రకారం ఆసుపత్రుల్లో ఐసీయా కాకుండా రోజుకు రూ.5వేలు దాటిన రూమ్ రెంట్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తారు. అది కూడా ఐటీసీ (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) కాకుండానే. అలాగే బయో మెడికల్ వేస్ట్‌పై, క్యాన్సర్ థెరపీ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్స్‌పై, మరికొన్ని సేవలపై 12 శాతం జీఎస్టీ విధించారు. దీంతో రోగులకు వైద్య సేవలు భారం కానున్నాయి. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐఎమ్ఏ, కేంద్రానికి లేఖ రాసింది. వైద్య సేవలపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలని కోరింది.

Governor Tamilisai : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

‘‘క్యాన్సర్ థెరపీ, రూమ్ రెంట్, ఇతర సేవలపై జీఎస్టీ విధింపు సరికాదు. దీనివల్ల ఆసుపత్రులపై భారం పడుతుంది. ఆసుపత్రులు ఈ భారాన్ని పేషెంట్లపై వేస్తాయి. దీంతో వైద్య సేవలు మరింత భారంగా మారి రోగులు ఇబ్బంది పడతారు. ప్రజల మీద భారం వేసి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలనుకోవడం సరికాదు. దీనివల్ల ప్రజలు పేదలుగా మారుతారు. వాళ్లు ఆసుపత్రి చార్జీలు ఎలా చెల్లిస్తారు. అందుకే వెంటనే వైద్య సేవలపై జీఎస్టీని తొలగించండి’’ అని కేంద్రానికి రాసిన లేఖలో ఐఎమ్ఎఫ్ కోరింది.