Governor Tamilisai : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్‌ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్‌ హాల్స్‌లో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్నారు.

Governor Tamilisai : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

Tamilisai

Updated On : July 17, 2022 / 7:42 AM IST

Governor Tamilisai : భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి రైలు మార్గం ద్వారా ఆమె మణుగూరుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్ నుండి రైళు మార్గం ద్వారా మణుగూరుకు చేరారు. మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌లో టిఫిన్‌ చేసిన అనంతరం వరద ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించనున్నారు. వరద బాధితులను స్వయంగా పరామర్శించనున్నారు.

అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్‌ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్‌ హాల్స్‌లో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్నారు.

Heavy Rains : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

తిరిగి సాయంత్రం ఆమె రైలులో హైదరాబాద్‌ చేరుకుంటారు. వాస్తవానికి ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు హాజరుకావాల్సి ఉన్నా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు.. ఆ ప్రయాణాన్ని తమిళిసై రద్దు చేసుకున్నారు.