Rainfall: దేశంలో 50 శాతం అదనపు వర్షపాతం నమోదు

ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది

Rainfall: దేశంలో 50 శాతం అదనపు వర్షపాతం నమోదు

Rainfall

Updated On : July 16, 2022 / 3:32 PM IST

Rainfall: దాదాపు వారం రోజులుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ అధిక వర్షాల ప్రభావంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఈ నెల 7-13 వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. దేశంలో దాదాపు 50 శాతం అదనపు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Inflation: ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే ఎక్కువ

ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. దేశంలో 93.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కనీసం 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం కురిసింది. వారపు సగటుతో పోలిస్తే ఈ నెల 7-13 వరకు 1,200 శాతం వర్షం కురిసింది. ఈ వారానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల్లో అధిక వర్షపాతం నమోదైంది.

Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం అంటే 77.3 శాతం మాత్రమే వర్షం కురిసింది. ఈశాన్య రాష్ట్రాల్లో 66 శాతం తక్కువ వర్షపాతం కురిసింది.