Home » Visit
ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత్ పర్యటనకు రానున్నారు. జనవరి రెండో వారంలో భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ నుంచి సీజేఐ రోడ్డు మార్గాన నందిగామ, పేరకలపాడు గ్రామం మీదుగా సీజేఐ ఎన్వీ రమణ పొన్నవరం చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర చేశారు.
వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో పర్యటించిన సీఎం జగన్ పెన్నా నదిని పరిశీలించారు.
ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.
హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్ అందజేశారు.