CM Jagan : సీఎం జగన్ తిరుపతి పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

CM Jagan : సీఎం జగన్ తిరుపతి పర్యటన

Jagan

Updated On : October 9, 2021 / 8:08 AM IST

CM Jagan visit Tirumala : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని.. తర్వాత అలిపిరి వద్ద గో మండపాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

అక్టోబర్ 12న ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం జగన్‌ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించనున్నారు. కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభింస్తారు. అన్నమయ్య, భవన్‌లో టీటీడీ, ఏపీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ, టీటీడీ కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించనున్నారు.