విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్

ప్రముఖ టెలికం నెట్ వర్క్ ఎయిర్ టెల్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ అందించే ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్లానపై ఎన్నో ఆఫర్లు అందిస్తోంది.

  • Published By: sreehari ,Published On : March 5, 2019 / 01:32 PM IST
విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్

ప్రముఖ టెలికం నెట్ వర్క్ ఎయిర్ టెల్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ అందించే ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్లానపై ఎన్నో ఆఫర్లు అందిస్తోంది.

ప్రముఖ టెలికం నెట్ వర్క్ ఎయిర్ టెల్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ అందించే ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్లానపై ఎన్నో ఆఫర్లు అందిస్తోంది. షార్ట్ టైం వ్యాలిడెటీ నుంచి లాంగ్ టైం వ్యాలిడెటీ ఆఫర్లతో ఆకర్షిస్తోంది. ఎయిర్ టెల్ అందించే ప్లాన్లలో ఒకటి..(Airtel Foreign Pass) ఎయిర్ టెల్ ఫారెన్ పాస్. 2018 ఆగస్టులో ఈ రీఛార్జ్ ప్లాన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Also Read : పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్

ఎయిర్ టెల్ ఫారెన్ పాస్ రీఛార్జ్ ప్లాన్ పై చౌకైన ధరలకే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ పొందొచ్చు. విదేశీ ప్రయాణం చేసేవారికి ఈ ప్లాన్ బెనిఫెట్ ప్లాన్ గా చెప్పవచ్చు. సాధారణంగా అబ్రాడ్ కు వెళ్లే సమయంలో యూజర్లు తమ స్నేహితులు, బంధువులతో మాట్లాడాలంటే ISD, IR రీఛార్జ్ ప్లాన్స్ పై అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్ టెల్ అందించే ఫారెన్ పాస్ ప్లాన్ తో చౌకైన ధరకే పొందొచ్చు. 

ఏ దేశాలకు వర్తిస్తుందంటే.. 
ఎయిర్ టెల్ ఫారెన్ పాస్ రీఛార్జ్ ప్యాకులు విదేశాలకు ట్రావెల్ చేసే ఎయిర్ టెల్ కస్టమర్లకు, మొత్తం 20 దేశాల్లో ఈ ప్యాక్స్  అందుబాటులో ఉన్నాయి. యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, యూఎస్ఏ, ఖతర్, కువైట్, మలేసియా, సింగపూర్, యుకే, శ్రీలంక, బహేరియన్, చైనా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగ్ కాంగ్, ఫ్రాన్స్, నెథర్లాండ్స్, థాయిలాండ్  ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ దేశాల్లో లోకల్ SIMs కొనాల్సిన అవసరం లేదు. 
Also Read : ఫీచర్ డిజేబుల్డ్ : ఆండ్రాయిడ్ టీవీలో బగ్.. యూజర్ల ఫొటోలు లీక్

రూ.196 తో రీఛార్జ్… 
ఎయిర్ టెల్ ఫారెన్ పాస్ రీఛార్జ్ ప్లాన్ ప్రారంభ ధర రూ.196 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. వాయిస్ కాల్ పొందొచ్చు. పాపులర్ ట్రావెల్ యూజర్లకు ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ ఫారెన్ పాస్ ప్యాక్ వ్యాలిడెటీ 1 రోజు, 10 రోజులు, 30 రోజులు వరకు ఉంటుంది. ఈ ప్లాన్ లో బెనిఫెట్స్ ఏంటంటే.. స్థానిక దేశంలో ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, కాలింగ్ మినిట్స్, టెక్స్ట్స్ మెసేజ్ లు పొందొచ్చు. 

ఎయిర్ టెల్ Foregin Pass ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే..  
* My Airtel యాప్ లేదా Airtel వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి.
* ఎయిర్ టెల్ రిటైలర్ షాపుల్లో కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 

బెనిఫెట్స్ ఇవిగో.. 
ఎయిర్ టెల్ ఫారెన్ పాస్ స్కీం కింద మూడు ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. అందులో మొదటిది.. రూ.196, రెండోవది రూ.3296, మూడోది రూ.446 రీఛార్జ్ ప్లాన్ ఉన్నాయి. రూ.196 రీఛార్జ్ ప్లాన్ పై కింది విధంగా బెనిఫెట్స్ పొందొచ్చు. 
* 20 నిమిషాల పాటు ఉచితంగా లోకల్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 
* ఇండియాకు 7 రోజుల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

రూ. 3296 రీఛార్జ్ ప్లాన్ : 
* ఈ ప్యాక్ పై 40 నిమిషాల పాటు ఉచితంగా లోకల్ కాల్స్, ఔట్ గోయింగ్ వాయిస్ కాల్స్ 
* 30 రోజుల పాటు ఇండియాకు కాల్స్ చేసుకోవచ్చు. 

రూ. 446 రీఛార్జ్ ప్లాన్ : 
*  75 రోజుల పాటు ఉచితంగా ఇండియాకు లోకల్ వాయిస్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్
* 90 రోజుల వ్యాలిడెటీ పిరియడ్ ఉంటుంది. 
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్