గూగుల్ Chrome ఆఫర్ : ట్రాకింగ్ లిమిట్.. ప్రైవసీ టూల్స్ 

మీరు గూగుల్ క్రోం బ్రౌజర్ వాడుతున్నారా? ఏదైనా వెబ్ సైట్ బ్రౌజ్ చేసినప్పుడు ఆ సైట్ కు సంబంధించిన కుకీస్ (Cookies) క్రోం బ్రౌజర్ లో స్టోర్ అవుతుంటాయి.

  • Published By: sreehari ,Published On : May 7, 2019 / 11:51 AM IST
గూగుల్ Chrome ఆఫర్ : ట్రాకింగ్ లిమిట్.. ప్రైవసీ టూల్స్ 

మీరు గూగుల్ క్రోం బ్రౌజర్ వాడుతున్నారా? ఏదైనా వెబ్ సైట్ బ్రౌజ్ చేసినప్పుడు ఆ సైట్ కు సంబంధించిన కుకీస్ (Cookies) క్రోం బ్రౌజర్ లో స్టోర్ అవుతుంటాయి.

మీరు గూగుల్ క్రోం బ్రౌజర్ వాడుతున్నారా? ఏదైనా వెబ్ సైట్ బ్రౌజ్ చేసినప్పుడు ఆ సైట్ కు సంబంధించిన కుకీస్ (Cookies) క్రోం బ్రౌజర్ లో స్టోర్ అవుతుంటాయి. ఇకపై మీ క్రోం బ్రౌజర్ లో థర్డ్ పార్టీ కుకీస్ స్టోరింగ్ విషయంలో కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్ క్రోం కొత్త టూల్స్ ఆఫర్ చేస్తోంది.

ఈ కొత్త టూల్స్ ద్వారా యూజర్లకు తమ క్రోం బ్రౌజర్ లో డ్యాష్ బోర్డ్ ఫంక్షన్ అప్ డేట్ కానుంది. ఈ ప్రైవసీ టూల్స్ ద్వారా యూజర్లు ఆన్ లైన్ ట్రాకింగ్ కుకీస్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రైవసీ టూల్స్ ద్వారా ఆన్ లైన్ ట్రాకింగ్ లిమిట్ ను ఈజీగా అదుపు చేయవచ్చు. 

కుకీస్ చూడటానికి చాలా చిన్న టెక్స్ట్ పరిమాణంలో ఉంటాయి. ఇంటర్నెట్ యూజర్లను ఫాలో అవుతుంటాయి. ప్రత్యేకించి అడ్వెర్టైజర్లు ఎక్కువగా ఈ కుకీస్ ను టార్గెట్ చేస్తుంటారు. వినియోగదారులు బ్రౌజింగ్ చేసే సమయంలో వారికి నచ్చిన ప్రొడక్టులను డిసిప్లే చేసేందుకు కుకీస్ ను వినియోగిస్తుంటారు. 2018 ఏడాదిలో ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీ డేటా షేర్ కావడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

యూజర్ల ప్రైవసీకి సంబంధించి గూగుల్ కూడా చర్యలు చేపట్టింది. క్రోం ప్లాట్ ఫాంపై స్టోర్ అయ్యే కుకీస్ ట్రాకింగ్ పై గూగుల్.. కనీసం ఆరేళ్ల వరకు వర్క్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో కుకీస్ స్టాప్ చేయడం.. ప్రారంభించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. యూజర్ల బ్రౌజర్లలో ఇన్ స్టాల్ అయ్యే ప్రాఫిట్ కోరే థర్డ్ పార్టీ కుకీలే టార్గెట్ గా గూగుల్ కంపెనీ పనిచేయనున్నట్టు జనరల్ తెలిపింది.

2017లో ఆపిల్ కంపెనీ తమ సఫారీ బ్రౌజర్ పై డిఫాల్ట్ ఇన్ స్టాల్ అయ్యే ట్రాకింగ్ కుకీలను నిలిపివేసింది. మెజిల్లా కార్పొరేషన్ ఫైర్ ఫాక్స్ కూడా తమ బ్రౌజర్ ప్లాట్ ఫాంపై ట్రాకింగ్ కుకీలను నిలిపివేసింది. క్రోం బ్రౌజర్ లో ఆన్ లైన్ ట్రాకింగ్ పరిమితిపై ప్రైవసీ టూల్స్ తీసుకురావడంపై  గూగుల్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.