Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్‌యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!

Jeep Meridian SUV : జీప్ ఇండియా (Jeep India) ఎట్టకేలకు మెరిడియన్ సెవెన్-సీటర్ SUVని రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్‌యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!

Jeep Meridian 7 Seat Suv Launched In India At Rs 29.90 Lakh Price And Features (1)

Jeep Meridian SUV : జీప్ ఇండియా (Jeep India) ఎట్టకేలకు మెరిడియన్ సెవెన్-సీటర్ SUVని రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. టాప్-స్పెక్ జీప్ మెరిడియన్ లిమిటెడ్ (O) 9AT 4×4 వెర్షన్ ధర రూ. 36.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 2022 జీప్ మెరిడియన్ వేరియంట్ SUV డెలివరీలు జూన్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ SUV కారు లిమిటెడ్, లిమిటెడ్ (O) అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది. కొత్త జీప్ మెరిడియన్ టెక్నో గ్రీన్, వెల్వెట్ రెడ్ సహా 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్రాండ్ సెలెక్-టెర్రైన్ 4×4 ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను 4 ట్రాక్షన్ మోడ్‌లతో వచ్చింది. అందులో మంచు, ఇసుక, మట్టి, ఆటో డైమెన్షనల్‌గా వచ్చింది. జీప్ మెరిడియన్ 4,769mm పొడవు, 1,859mm వెడల్పు, 1,698 mm పొడవు, 2,782 mm పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. 170-లీటర్ బూట్ స్పేస్‌తో (మొత్తం 3 వరుసలతో) వచ్చింది.

203mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. మెరిడియన్‌కి వైర్‌లెస్ ఛార్జర్, USB A-C-ఛార్జింగ్ పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ 8-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-మౌంటెడ్ థర్డ్-వరో AC వెంట్‌లతో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ‘ఎంపరడార్’ బ్రౌన్ సీట్లతో పాటు ప్రీమియం ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌ కూడా ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. జీప్ యుకనెక్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మెరిడియన్ సీటింగ్ డిజైన్ రెండవ, మూడవ వరుసలు వాలుగా ఉంటాయి. ఈ సీట్లను పూర్తిగా ఫ్లాట్‌గా మడిచే వీలుంది.

Jeep Meridian 7 Seat Suv Launched In India At Rs 29.90 Lakh Price And Features

Jeep Meridian 7 Seat Suv Launched In India At Rs 29.90 Lakh Price And Features

2022 జీప్ మెరిడియన్ కారులోని ఇంజిన్ యూనిక్ 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో 170hp శక్తిని, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ MTతో పాటు ఐచ్ఛికంగా 9-స్పీడ్ ATతో కలిసి ఉంటుంది. రెండోది ఐచ్ఛిక ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. గరిష్టంగా 198 kmph వేగాన్ని ఇస్తుంది. 10.8 సెకన్లలో 0 నుంచి 100 kmph వరకు దూసుకెళ్లగలదు.

సెక్యూరిటీ ఫీచర్లు :
2022 జీప్ మెరిడియన్ 7-సీటర్ SUV సేఫ్టీ సూట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కలిగి ఉంది. EBDతో కూడిన ABS, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉన్నాయి.

2022 జీప్ మెరిడియన్ ధర ఎంతంటే? :
రూ. 29.90 లక్షలు (ఎక్స్-షోరూమ్), జీప్ మెరిడియన్ అతిపెద్ద పోటీదారు అయిన టొయోటా ఫార్చ్యూనర్‌ కంటే దాదాపు రూ. 2 లక్షలు తక్కువ.. ఎంట్రీ-లెవల్ లిమిటెడ్ MT 2WD వేరియంట్ ధర రూ. 29.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రేంజ్-టాపింగ్ జీప్ కంపాస్ కన్నా కేవలం రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. జీప్‌ మెరిడియన్‌కి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. రూ. 50,000 డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే చాలు..మెరీడియన్‌ను వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. జూన్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. బుకింగ్స్‌ ప్రారంభించడానికి ముందే 67,000పైగా ఎంక్వైరీలు వచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also :  Jet Airways: మూడేళ్ల తర్వాత ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు