Lava X3 (2022) Sale In India : భారత్‌లో లావా X3 ఫోన్ సేల్ మొదలైందోచ్.. అద్భుతమైన ఫీచర్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం..!
Lava X3 (2022) Sale In India : భారత మార్కెట్లో లావా కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. 2022 మోడల్ లావా X3 ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ నెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయింది.

Lava X3 (2022) goes on Sale in India _ Price, offers and more
Lava X3 (2022) Sale In India : భారత మార్కెట్లో లావా కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. 2022 మోడల్ లావా X3 ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ నెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Lava X3 (2022)ని Amazon India వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 6,999గా ఉంది.
ఆర్టిక్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్, లస్టర్ బ్లూ ఫోన్ కలర్ ఆప్షన్‌లను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌పై వెల్‌కమ్ ఆఫర్‌లలో రూ. 6,600 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది. AU స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ ఉంది. HSBC క్రెడిట్ క్యాడ్ హోల్డర్లు Lava X3 (2022) పై 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI కొనుగోలు ఆప్షన్ కూడా ఉంది.
Lava X3 (2022) స్పెసిఫికేషన్‌లు :
లావా X3 (2022) 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3GB RAMతో వచ్చిన MediaTek Helio A22 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్ 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Lava X3 (2022) goes on Sale in India _ Price, offers
Lava X3 (2022) స్టోరేజీని 512GB వరకు విస్తరించడానికి మైక్రో SD కార్డ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో ఫోన్ రన్ అవుతుంది. ఆప్టిక్స్ కోసం, Lava X3 (2022) వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. 8MP ప్రైమరీ కెమెరాతో పాటు LED ఫ్లాష్‌తో కూడిన VGA సెన్సార్‌ను కలిగి ఉంది.
సెల్ఫీల కోసం డివైజ్ ముందు భాగంలో 5MP కెమెరాను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌కు 4,000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 10 వాట్ల ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది. సెక్యూరిటీ పరంగా ఫోన్‌లో వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంతలో, లావా భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ విస్తరించింది. లావా బ్లేజ్ NXT స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ బడ్జెట్ కేటగిరీ ఫోన్ కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఒరిజినల్ బ్లేజ్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా వస్తుంది. Lava Blaze Nxt స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్లో రూ. 9,299గా ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : OnePlus 11 Specifications : మరో ఐదు రోజుల్లో వన్‌ప్లస్ 11 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!