Gone Prakash : మధుయాష్కిని టార్గెట్ చేసిన గోనె ప్రకాష్ .. అమెరికాలో అంట్లు తోమారు అంటూ సంచలన వ్యాఖ్యలు

మధుయాష్కి, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని..న్యూయార్కులో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్ గా యాష్కీని నిషేధించింది అన్నారు గోనె ప్రకాశ్. యాష్కీ న్యూయార్క్ లో అటార్నీ కాదు అమెరికాలో అంట్లు తోమారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Gone Prakash : మధుయాష్కిని టార్గెట్ చేసిన గోనె ప్రకాష్ .. అమెరికాలో అంట్లు తోమారు అంటూ సంచలన వ్యాఖ్యలు

Gone Prakash..Madhu Yaskhi

Updated On : September 22, 2023 / 2:38 PM IST

Gone Prakash..Madhu Yaskhi : తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి (Madhu Yaskhi)ని టార్గెట్ చేస్తు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ (Gone Prakash)ఘాటు విమర్శలు చేశారు. మధుయాష్కి మోసగాడు అంటూ విరుచుకుపడ్డారు. మధుయాష్కి, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని..న్యూయార్కులో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్ గా యాష్కీని నిషేధించింది అన్నారు. యాష్కీ న్యూయార్క్ లో అటార్నీ కాదు అమెరికాలో అంట్లు తోమారేమో అంటూ ఎద్దేవా చేశారు.

దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీలు సంపాదించారని..కాకతీయ,గుల్బర్గా యూనివర్సిటీల నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించారని అన్నారు. గతంలో కూడా నేను ఆయనపై చేసిన ఆరోపణల విషయంలో యాష్కీ నాపై దాడి చేయించారని..నేను చావుకు కూడా భయపడనని స్పష్టంచేశారు. నాపై జరిగిన దాడి విషయంలోనే మధుయాష్కీ పై హైకోర్టు లో పోరాడుతున్నానని తెలిపారు. జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఒక్క అంశం పై కూడా మధుయాష్కీ మాట్లాడలేదని..ఎల్బీ నగర్ లో అతనికి డిపాజిట్లు కూడా రావు అంటూ జోస్యం చెప్పారు.

Congress : అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచిన కాంగ్రెస్.. ఆశావాహులంతా ఢిల్లీ బాట

మధుయాష్కిని ఎన్నికల్లో నిలబెడితే కాంగ్రెస్ కు నష్టమని అతని వల్ల కాంగ్రెస్ 10సీట్లు కోల్పోతుందన్నారు. తన నియోజకవర్గం అయిన  నిజామాబాద్ లో అతను ఎందుకు పోటీ చేయడం లేదు..? అని ప్రశ్నించారు. కర్ణాటకలో తన వల్ల రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది అని చెబుతున్న యాష్కీ నిజామాబాద్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు.

జంగయ్య అనే చాకలి వ్యక్తిని వంట మనిషిగా అమెరికా తీసుకువెళ్లి అక్కడ ఆయన గ్రీన్ కార్డును ఇతరులకి అమ్ముకున్న వ్యక్తి మధుయాష్కీ అంటూ సంచలన విమర్శలు చేశారు. 20 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి వచ్చిన మధుయాష్కీ వందల మందిని మోసం చేశారు అంటూ ఆరోపించారు. ఇక అతని ఆటలు సాగవని జైలుకు పోవడం ఖాయం అని అన్నారు. మధుయాష్కీ ని ఇంటర్ పోల్ వాళ్ళు పట్టుకుంటారని..ఇక ఆయన అమెరికాకు తన జీవితంలో వెళ్లలేరని అన్నారు. యాష్కీ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తారని అన్నారు.

Vijayashanthi : కమలం పార్టీలో కలకలం.. నాకా అలవాటు లేదంటూ సొంత పార్టీ నేతలపైనే విజయశాంతి సీరియస్