Kastruba College Gas Leak : మిస్టరీగా కస్తూర్బా కాలేజ్‌ ఘటన.. అసలేం జరిగింది? గ్యాస్ ఎలా లీక్ అయ్యింది?

సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్ వ్యవహారం మిస్టరీగా మారింది. అసలు కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు ఒక్కసారిగా ఎందుకు అస్వస్థతకు గురయ్యారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

Kastruba College Gas Leak : మిస్టరీగా కస్తూర్బా కాలేజ్‌ ఘటన.. అసలేం జరిగింది? గ్యాస్ ఎలా లీక్ అయ్యింది?

Kastruba College Gas Leak : సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్ వ్యవహారం మిస్టరీగా మారింది. అసలు కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు ఒక్కసారిగా ఎందుకు అస్వస్థతకు గురయ్యారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

మొదట కాలేజీ సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వార్తలు వస్తే, యాజమాన్యం మాత్రం అసలు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేసే లేదని చెబుతోంది. బయటి నుంచి వచ్చిన గ్యాస్ వల్లే విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని అంటున్నారు కాలేజీ సిబ్బంది. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు క్లూస్ టీమ్ తో కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. కాలేజీ పరిసరాలతో పాటు ల్యాబ్ ని పరిశీలించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది? విద్యార్థినులు ఎలా స్పృహ తప్పి పడిపోయారు? ఆరా తీస్తున్నారు. మరోవైపు తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో కాలేజీకి చేరుకుంటున్నారు.

Also Read : Kastruba Gandhi College Gas Leak : సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్, 14మంది విద్యార్థినులకు అస్వస్థత

కస్తూర్బా కాలేజీలో విష వాయువుల లీక్ కావడం, 41 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. విద్యార్థులు సైన్స్ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయారని తొలుత వార్తలొచ్చాయి. అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.