Tirumala Devotees: జస్ట్ 2 గంటల్లోనే.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.

Tirumala Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏఐ ద్వారా రెండు గంటల్లో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

ఇందుకోసం గూగుల్, టీసీఎస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

మరోవైపు టీటీడీలో పని చేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అన్యమత ప్రచారంలో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు.

మరోవైపు తిరుమలపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు.

అలా చేస్తే ఊరుకునేది లేదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పనిగట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.

తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.

Also Read: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు.. ప్లానేంటి..?