Silk Production : పట్టుదారం ఉత్పత్తిలో పట్టు సాధించిన చేనేత దంపతులు

సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసే రైతులకు పట్టుపరిశ్రమ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంగా లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పట్టుదల, పనిపట్ల నిబద్ధతు ఉండాలి.

Silk Production

Silk Production : ప్రతి వ్యవస్థాపకుడు తన పరిశ్రమను లాభాల్లో ఉండాలని కోరుకుంటారు. ఇది ఒక గొప్ప కల అయితే దానిని నిజం చేయడం మరొక కథ. సంస్థ ఎదగడానికి వ్యూహం, భాగస్వాముల సహకారం.. కస్టమర్ అవసరాలను తీర్చడం అత్యంత ముఖ్యమైనది. ఇలా అన్నీటిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. ఒక బలమైన కార్యాచరణతో ఒక మోడల్ గా ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ నిర్మించి.. విజయపథంలో నడుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ చేనేత కార్మికుల జంట. మరి వారు సాధించిన విజయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

బట్టలను నేయడం ఎన్నో కష్టాలతో కూడుకున్న పని. అందులో పట్టుచీరల తయారీకి వాడే దారాన్ని సేకరించడమంటే.. మరింత కష్టం. ఈ దారాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేచేవారు. నాణ్యత సరిగ్గా లేకపోయినా.. వేరే అవకాశం లేకపోడంతో అధిక ధర చెల్లించి తెచ్చుకుని చీరలను నేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ.. ముందుకు సాగుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ కు చెందిన గంజి శ్రీహరి దంపతులు…

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ఏ వ్యాపారమైనా విజయవంతం కావాలంటే వినియోగదారులు అవసరం. అభివృద్ధి చెందాలంటే ఒకసారి వచ్చిన వాళ్లు మళ్లీ మళ్లీ రావాలి. ఇలా వినియోగదారులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు గంజి శ్రీహరి. ఈయన మొదట వంశపారంపర్యంగా వస్తున్న మాస్టర్ వీవర్ పనిని చేసే వారు. గతంలో మగ్గాలపై పనిచేసి దారం సేకరణకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇందుకోసం పట్టుదారం సొంతంగా తయారుచేయాలనుకున్నారు. ఒక జనగామలో మినహా తెలంగాణలో ఎక్కడ పట్టుదారాలు తీసే పరిశ్రమలులేదు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

అందుకే స్థానిక నేత కార్మికులకు దారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో.. కృష్ణ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ ను ప్రారంభించారు. దీని ద్వారా నాణ్యమైన దారాన్ని సరసమైన ధరకే ఇస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లంతా శ్రీహరి వద్దే కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఇలా వ్యాపారాన్ని క్రమంగా పెంచుకుంటూ… సెరికల్చర్ అధికారుల సహకారంతో 2021 లో ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు  100 కిలోల వరకు పట్టుదారం తీస్తూ.. 70 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

లాభదాయకత కంటే అవసరాలను తీర్చడానికి పరిశ్రమ ప్రారంభిస్తే.. వాటికదే లాభాలు తెచ్చిపెడుతుంది. ఇందుకు నిదర్శనమే ఈ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్. ప్రతిరోజు వచ్చే పట్టుదారాన్ని పోచంపల్లి, చేనేత సహకార సంఘాలు, వీవర్లకు ఆర్డర్లపై అందిస్తూ.. ఏడాదికి మూడు, నాలుగు కోట్ల టర్నోవర్ చేస్తున్నారు.

READ ALSO : Bodakakara Cultivation : కలిసిరాని బోడకాకర సాగు..వాతావరణ మార్పులే కారణం

సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసే రైతులకు పట్టుపరిశ్రమ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంగా లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పట్టుదల, పనిపట్ల నిబద్ధతు ఉండాలి. అలాంటి రైతులకు పట్టుపరిశ్రమ శాఖ ద్వారా ప్రోత్సాహాలు అందిస్తోంది. ఇందులో బాగంగానే రైతు శ్రీహరికి ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ ను సబ్సిడీకింద అందించింది.