Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

Agriculture Farming : ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు.

Agriculture Farming : ఆలోచన అవిష్కరణగా మారింది. పంటల మీద చేసిన ప్రయోగం ఫలించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే,  అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా.. మిశ్రమ పంటలు సాగువిధానం చేపడితే.. రైతుల అభివృద్ధికి అడుగులు పడతాయి. దీన్నే తూచాతప్పకుండా పాటిస్తూ.. నెలనెల మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు. మరి ఆయన సాగుచేస్తున్న విధానాలు.. ఏంటో మనమూ తెలుసుకుందామా..

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

ఏకపంట విధానంలో నష్టాలను చవిచూస్తున్న రైతులు : 
వ్యవసాయం అంటే ఒకే పంట విధానం కాదు.. మూస పద్దతి అంతకన్నా కాదు.. అనేక రకాల పంటల మేళవింపు.. ఇది అనుభవజ్ఞులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే,  రైతులకు కష్టాలనేవే ఉండదు.  ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు.

అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.

సమీకృత సాగుతో అధిక లాభాలంటున్న రైతు : 
మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి. ఇది గమనించిన ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, ఎలవల్లి గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరంలో సమీకృత వ్యవసాయం చేపట్టారు. 30 సెంట్లలో చేపల చెరువు తవ్వించారు. చెరువు గట్టుపై అనేక రకాల పండ్ల మొక్కలు.. కూరగాయల సాగుచేస్తున్నారు. ఆ పక్కనే వరిసాగు చేస్తున్నారు. ఇలా అనేక పంటల కలయికతో ఎకరంలో సమీకృత సాగుచేస్తూ.. నెలకు 60 వేలు ఆదాయం పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సమీకృత సాగుతో పాటే 20 సెంట్లలో ఏటిఎం విధానంలో కూరగాయలు సాగుచేస్తున్నారు రైతు. ప్రతి నెలా కనీసం రూ.10 నుండి 25 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరం లాంటిది. ఏటీఎం మోడల్‌ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు 45 రోజుల నుంచే దిగుబడి రావటం ప్రారంభమవుతుంది.

Read Also : Pesara Farming : ప్రస్తుతం పెసరలో చేపట్టాల్సిన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు