Pesara Farming : ప్రస్తుతం పెసరలో చేపట్టాల్సిన యాజమాన్యం

Pesara Farming : ప్రస్థుతం వేసవి పంటగా పెసరను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్  కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.

Pesara Farming : ప్రస్తుతం పెసరలో చేపట్టాల్సిన యాజమాన్యం

pesara farming and techniques for agriculture

Pesara Farming : స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో  చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . సాగు ఆరంభం నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు  పాటించినట్లయితే ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం వేసవి పంటగా పెసరను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్  కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ఏ ఏటికాయేడు తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. కొంత కాలంగా మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం… సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో చేతికి అందివస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయింది. అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది.

తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది. ప్రస్తుతం వేసవి పెసరను విత్తిన రైతులు అధిక దిగుబడులను తీయాలంటే సాగులో ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్  కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.

Read Also : Green Manure Cultivation : భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరోట్టపైర్లు..