New Rice Varieties MTU 1318
New Variety Of Rice : ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం అందుబాటులోకి వచ్చింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా మారుటేరు పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఎం.టి.యు – 1318 (పదమూడు పద్దెనిమిది ) రకం అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. 2022 లో విడుదలైన ఈ రకం తెగుళ్లను తట్టుకొని , తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్ కు అనువైన ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : Cashew Cultivation : జీడి రైతులను ముంచిన అకాల వర్షాలు
ఆంద్రప్రదేశ్ లో స్వర్ణ రకం వరి వంగడానిదే హవా.. అధికంగా ఈ రకాన్నే సాగుచేస్తుంటారు. అయితే అధిక దిగుబడి ఉన్నప్పటికీ తుఫాన్‌ల ధాటికి చేలు పడిపోతుంటాయి. తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ నేపధ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా కేంద్రం ఎంటీయూ -1318 రకం వరి వంగడాన్ని రూపొందించారు. మినికిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి అందరిని ఆకర్షించింది.
READ ALSO : Citrus Cultivation : నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు
రాష్ట్రస్థాయిలో 2022 లో విడుదలైన ఈ రకం ఖరీఫ్ సాగుకు అనువైనది. దోమపోటును, ఎండాకు తెగులును, అగ్గితెగులను పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది. పంట కాలం150 రోజులు. ధాన్యం ఎరుపుగా, బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం గింజ రాలకుండా, తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగడాన్ని స్వర్ణ కంటే ఎకరాకు 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి వస్తుంది. ఈ రకం గుణగణాలేంటో మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సునిత ద్వారా తెలుసుకుందాం.
READ ALSO : Drumstick Farming : మునగసాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే…
వరిలో స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనం ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఎం.టి.యు 1318 రకాన్ని సాగుచేసే రైతులు.. తక్కువ ఖర్చుతోనే నాణ్యమూన విత్తనాన్ని తయారుచేసేకొని తరువాత పంటలకు ఉపయోగించుకోవచ్చు. లేదా ఇతర రైతులకు విత్తనంగా అమ్ముకోవచ్చు. అయితే జన్యుస్వచ్చతను కాపాడి.. నాణ్యమైన విత్తనాన్ని పొందాలంటే కొన్ని మెళకువలను పాటించాలి.