Drumstick Farming : మునగసాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే…

ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో... పీకెఎం-1 ఒకటి. దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది.

Drumstick Farming : మునగసాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే…

Drum Stick1

Drumstick Farming : భారతీయుల వంటకాల్లో మునగకాయకు ప్రత్యేక స్ధానం ఉంది. ఎక్కువ పోషక విలువలు ఉండటంతో మునగకాయలను ఆహారంలో భాగంగా చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈక్రమంలో వాణిజ్యశైలిలో మునగపంటసాగుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మునగసాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. అధిక దిగుబడులను ఇచ్చే వెరైటీలు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం…

ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వ్యవధిలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో… పీకెఎం-1 ఒకటి. దీనిని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. మొక్కలు 6నుండి 7 మీటర్ల ఎత్తు పెరిగుతాయి. నాటిని 90 నుండి 100రోజుల్లో పూతకు వస్తుంది. 160 రోజుల కాలవ్యవధిలోనే మొదటికోత కోసుకోవచ్చు. ఒక్కో మొక్కకు సుమారుగా 220 కాయలు కాస్తాయి. కాయపొడవు 75 సెంటీమీటర్లు బరువు 150 గ్రాముల వరకు ఉంటాయి. వార్షిక మునగసాగుకు అనుకూలమైన ఈ రకం వెరైటీ హెక్టారుకు 50 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

పీకెఎం-2రకం మునగవిత్తనం..ఇది రకం నాటిన ఆరునెలల్లోనే కాపుకు వస్తుంది. కాయలు 126 సెంటీమీటర్ల పొడవు ఉండి 280 గ్రాముల బరువు తూగుతాయి. చెట్టుకు సంవత్సరానికి 220 కాయలు కాస్తాయి. ఒక హెక్టారుకు 98టన్నుల దిగుబడి ఇస్తుంది.

ధనరాజ్ వెరైటీ మునగ విత్తనం.. ఇది పొట్టి రకం వెరైటీ.సంవత్సరానికి 250 నుండి 300 కాయలు కాస్తాయి. నాటిన 9నుండి 10నెలల్లో కాపుకు వస్తుంది. కర్ణాటక కెఆర్సి ఉద్యాన కళాశాల ఈ వెరైటీని రూపొందించింది. కాయ బరువు 35 నుండి 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.

జాఫ్నా రకం మునగ విత్తనం… ఈ రకం మెత్తని గుజ్జుతో రుచికరంగా ఉంటాయి. బహువార్షిక మునగ రకం.. తొలి సంవత్సరంలో చెట్టుకు 80 నుండి 90 కాయలే కాస్తాయి. నాలుగో సంవత్సరం నుండి చెట్టుకు 500 నుండి 600 కాయలు కాస్తాయి. కాయపొడవు 60 నుండి 90 సెంటీమీటర్లు ఉంటుంది.

వీటితోపాటు అనేక దేశవాళీ రకాలు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జాఫ్నా, పీకేఎం1 మునగరకాలను సాగు చేస్తున్నారు. అదే క్రమంలో మునగకాయల కోసమే కాకుండా చాలా మంది రైతులు మునగ ఆకు కోసం కూడా సాగు చేపడుతున్నారు. మునగ ఆకులో ఉండే ఔషదగుణాల కారణంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు మునగసాగు చేపడుతున్నారు.