Asil Chicken Farming : ఆసిల్ కోళ్ల పెంపకంతో.. ఏడాదికి రూ. 5 కోట్ల టర్నోవర్
ఇందుకోసం మార్కెట్ ను అధ్యాయనం చేసి.. 2013 లో 300 సంకర జాతి అయిన ఆసిల్ కోడిపిల్లలతో పెంపకాన్ని చేపట్టారు. అయితే మొదట్లో అంత అవగాహన లేకపోవడంతో .. మొదటి రెండుబ్యాచుల్లో నష్టాలను చవిచూశారు. ఆరువాత సమస్యలను అధిగమిస్తూ.. లాభాల బాట పట్టారు.

Asil Chicken Farming
Asil Chicken Farming : కంప్యూటర్ సైన్స్ చదివిన ఏ కుర్రాడైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తన ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్ రెడ్డి మాత్రం దీనికి పూర్తి భిన్నం. మార్కెట్ లో మాంసానికి ఉన్నడిమాండ్ చూసి ఆసిల్ కోళ్ల పెంపకం చేపట్టారు. అయితే మొదట్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. వెనుకడుగు వేయలేదు. పెంపకంలో విజయం సాధించారు.
READ ALSO : Country Chicken: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల పెంపకం
ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు మండలం, మిటాత్మకూరు గ్రామంలో రైతు విజయ్ రెడ్డి. ఆసిల్ కోళ్లను పెంచడమే కాదు.. పిల్లలను ఉత్పత్తి చేస్తూ.. స్వయం ఉపాధి పొందుతూనే.. మరి కొంత మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.యువరైతు విజయ్ రెడ్డి ఎమ్మెస్సీ కంప్యూటర్ చదువుకున్నాడు. అయితే ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకోలేదు. సొంత కాళ్లపైనే నిలబడాలనుకున్నారు.
ఇందుకోసం మార్కెట్ ను అధ్యాయనం చేసి.. 2013 లో 300 సంకర జాతి అయిన ఆసిల్ కోడిపిల్లలతో పెంపకాన్ని చేపట్టారు. అయితే మొదట్లో అంత అవగాహన లేకపోవడంతో .. మొదటి రెండుబ్యాచుల్లో నష్టాలను చవిచూశారు. ఆరువాత సమస్యలను అధిగమిస్తూ.. లాభాల బాట పట్టారు.
READ ALSO : Nalgonda : జీతం చాల్లేదా ఏంటీ..? వృత్తి టీచర్.. ప్రవృత్తి కోళ్లు పట్టడం
ఒక మాసం కోసమేకాకుండా సొంతంగా ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసి అసీల్ చిక్ ఫ్యాక్టరీ పేరుతో.. ఆసిల్ కోడిపిల్లల ఉత్పత్తి చేసుకొంటూ.. ఏడాది పొడవునా మాంసం, గుడ్లు, కోడిపిల్లల అమ్మకం చేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో మార్కెట్ చేస్తూ.. అధిక ఆదాయం పొందుతున్నారు.