ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

వంగ, బెండ , గోరుచిక్కుడు, ముల్లంగి, తీగజాతి కూరగాయలు, కంది, బంతిపూలు  ఇలా పలు రకాలు పంటలతో ఉన్న ఈ మోడలే ఏటీఎం. అంటే ఎనీటైం పంటల దిగుబడి...

ATM Cultivation : ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు.. వాటి పంట కాలాని బట్టి దిగుబడి.. ఫలితంగా నిత్యం కోతలే… రోజూ కాసుల గలగలలే. ఇదంతా ఏటీఎం మోడల్ సాగు విధానంలో రైతుకు వచ్చే ఆదాయం. ఈ విధానాన్నే అనుసరిస్తూ.. ప్రకాశం జిల్లాలో ఓ రైతు అతితక్కువ విస్తీర్ణంలో అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఏటీఎం మోడల్ సాగు విధానం అంటే ఏంటీ..? ఏఏ పంటలను సాగుచేస్తారో అని అనుకుంటున్నారు కదా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ప్రకృతి వ్యవసాయంలోనే ఏటీఎం మోడల్ విధానాన్ని ఇటీవల కాలంలో ప్రవేశపెట్టింది ఆంద్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం. ఈ విధానంలో ప్రతి నిత్యం ఏదో పంటనుండి దిగుబడులు వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా, కొత్తపట్నానికి చెందిన రైతు నటారు ఆంజనేయులు 70 సెంట్లలో ఏటీఎం విధానంలో పలు పంటలు సాగుచేసి మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Hair Loss : జుట్టు రాలడానికి కారణాలు, చికిత్స, నివారణ !

ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం 70 సెంట్లు మాత్రమే.. అందులో బాడర్ క్రాపుగా సజ్జ, ఆముదం, మొక్కజొన్న పంటలు కనిపిస్తున్నాయి కదూ.. మధ్యలో వంగ, బెండ , గోరుచిక్కుడు, ముల్లంగి, తీగజాతి కూరగాయలు, కంది, బంతిపూలు  ఇలా పలు రకాలు పంటలతో ఉన్న ఈ మోడలే ఏటీఎం. అంటే ఎనీటైం పంటల దిగుబడి… కాసుల గలగలే.. రైతు ఆంజనేయులు గతంలో ప్రకృతి వ్యవసాయ విభాగం సిఆర్పీ గా పనిచేశారు. అయితే తాను వ్యవసాయం చేస్తూనే.. పలువురికి మార్గదర్శిగా ఉండాలని నిర్ణయించుకొని తనకున్న 70 సెంట్లలో 26 రకాల పంటలను పండిస్తున్నారు. ఇలా ఏడాదికి మూడు పంటలను పండిస్తూ.. అతి తక్కువ ఖర్చుతో.. నిత్యం ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

ఏటీఎం సాగు విధానంలో 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.10–25 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరం లాంటిది. ఏటీఎం మోడల్‌ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావటం ప్రారంభమవుతుంది. అందుకే కొందరు రైతులను ఎంపిక చేసి వారి చేత సాగుచేయిస్తున్నారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు