Hair Loss : జుట్టు రాలడానికి కారణాలు, చికిత్స, నివారణ !

వంశపారంపర్యంగా జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో ఒక వయస్సు వచ్చేనాటికి జుట్టుఊడిపోయి బట్టతలగా మారుతుంది. బట్టతలకి చాలా ముఖ్యమైన కారణాన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు.

Hair Loss : జుట్టు రాలడానికి కారణాలు, చికిత్స, నివారణ !

Hair Loss

Hair Loss : మనలో విశ్వాసం, ఆత్మగౌరవం నింపటంలో జుట్టు బాగా సహాయపడుతుంది. అందంగా కనిపించాలనుకునే వారికి తలపై జుట్టు అన్నది చాలా కీలకమైనది. పురుషులు, స్త్రీలు ఇద్దరిలో జుట్టు అన్నది అందానికి ఒక సింబాలిక్ గా ఉంటుంది. అత్యంత కీలకమైన జుట్టు విషయంలో నిత్యం చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. జుట్టు రాలిపోవటం చాలా మందిని బాధిస్తున్న సమస్యగా ఉంది. ఈ సమస్యల చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు అందరిని ప్రభావితం చేస్తుంది.

READ ALSO : Neehar Sachdeva : జుట్టురాలిపోతోందని డిప్రెషన్‌లోకి వెళ్లేవారు ‘నీహార్ సచ్‌దేవా’ స్టోరీ చదవండి

జుట్టు పెరుగుదల, రాలిపోయే విషయంలో మొత్తం మూడు కీలకమైన దశలు ఉంటాయి. వాటి గురించి చెప్పాలంటే మొదటిది అనాజెన్ (గ్రోత్) దశ, రెండవది క్యాటాజెన్ (విశ్రాంతి) దశ, మూడవది టెలోజెన్ (షెడ్డింగ్) దశ. సాధారణంగా జుట్టులో 70% పెరుగుదల దశలో ఉంటుంది, రెండవదాంట్లో 20% విశ్రాంతి తీసుకుంటుంది. మూడవదశలో 10% రాలిపోతుంది. కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తుండటం వల్ల సహజంగా ప్రతిరోజూ 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణమని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Hair Regeneration : జుట్టు రీజనరేషన్ తో బట్టతలకు బైబై

జుట్టు రాలడానికి కారణాలు ;

1. పోషకాహార లోపం : అవసరమైన పోషకాలు, హార్మోన్లు , థైరాయిడ్ స్థాయిలలో అసమతుల్యత జుట్టు రాలడానికి కారణమవుతాయి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం ద్వారా పోషకాహార లోపాలను తొలగించుకోవటం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

2. జీవనశైలి ఎంపికలు: చాలా మంది జుట్టుకోసం వివిధ రకాల రసాయనలతో కూడిన రంగులను వేస్తుంటారు. రీబాండింగ్, స్ట్రెయిటెనింగ్, కలరింగ్ వంటి సౌందర్య పద్ధతులను అనుసరించటం వల్ల జుట్టుకు హాని కలిగుతుంది. దీంతో జుట్టు రాలడం అన్నది మరింత తీవ్రతరం అవుతుంది. ఇందుకు వాటిలో ఉపయోగించే రసాయనాలే కారణం.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

3. ఒత్తిడి , హార్మోన్ల మార్పులు: ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతలు జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవటానికి వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది. దీని వల్ల జుట్టు రాలటాన్ని నివారించవచ్చు.

4. కొన్ని రకాల చర్మ సమస్యలు ; కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా జుట్టు రాలిపోవటానికి కారణమవుతాయి. అలాంటి సందర్భాల్లో చర్మ వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

5. జన్యుపరమైన సమస్యలు ; వంశపారంపర్యంగా జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో ఒక వయస్సు వచ్చేనాటికి జుట్టుఊడిపోయి బట్టతలగా మారుతుంది. బట్టతలకి చాలా ముఖ్యమైన కారణాన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. అదే క్రమంలో తలకు వేడి తగిలేలా చేసే హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించడం వల్ల వెంట్రుకల కుదుళ్లు కూడా దెబ్బతింటాయి. వీటి వల్ల జుట్టు ఊడిపోతుంది.

జుట్టు సంబంధిత సమస్యలకు చికిత్సలు ;

1. మందులు , ఇంజెక్షన్లు: జుట్టు రాలడాన్ని నివారించడంలో మినాక్సిడిల్, ఫినాస్టరైడ్ వంటి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించటంతోపాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

READ ALSO : China : అక్కడి మహిళల పొడవైన జుట్టు రహస్యం ఏంటంటే?

2. ఇంజెక్టబుల్ థెరపీలు: మెసోథెరపీ, ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ వంటి విధానాల ద్వారా తలపై పోషకాలను ఇంజెక్ట్ చేస్తారు. అయితే PRP చికిత్స వల్ల రోగి యొక్క రక్తాన్ని జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచేందుకు, జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తారు.

3. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్: జుట్టు రాలిపోయే పరిస్థితిలో కొందరికి శస్త్రచికిత్స అవసరమౌతుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అనేది దాత నుండి వెంట్రుకలను తీసుకొని జుట్టు లేని ప్రాంతాలలో వాటిని ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తారు. ఫోలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (FUT) మరియు ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ (FUE) వంటి వివిధ పద్ధతులను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిని సూచనలు, సలహాలు పొందటం మంచిది.