Hair Regeneration : జుట్టు రీజనరేషన్ తో బట్టతలకు బైబై

వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది.

Hair Regeneration : జుట్టు రీజనరేషన్ తో బట్టతలకు బైబై

hair regeneration

Hair Regeneration : కొందరిలో తల మీద జుట్టు లో ఇన్ ఫెక్షన్ వచ్చిందని చెబుతుంటారు. రింగ్ వార్మ్ ఇన్ ఫెక్షన్ తో జుట్టులో కొంత భాగం ఖాళీగా అయిపోతుంటుంది. ఇలా ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడే కాదు.. తలపై ఎక్కడైనా చిన్న గాయమైనప్పుడు కూడా ఆ భాగంలో జుట్టు ఊడిపోయి, ఇక పెరగదు. కానీ అలా గాయమైన చోట కూడా మళ్లీ వెంట్రుకలు పెరిగేలా చేయవచ్చంటున్నాయి కొత్త పరిశోధనలు. దెబ్బ తగిలిన చోట జుట్టు పెరిగేలా చేసే కొత్త ప్రక్రియను కనిపెట్టారు సైంటిస్టులు. బట్టతలతోబాధపడేవాళ్లకు కూడా ఈ చికిత్స కొత్త ఆశలు కలిగిస్తున్నది.

READ ALSO : Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

ఫైబ్రోబ్లాస్ట్ కణాలతోనే బలం

సాధారణంగా గాయమైన చోట వెంట్రుకలు పెరగవు. కాని  వాటిని పెరిగేలా చేయగల కొత్త మందులు కనుక్కోవడానికి పునాది వేశారు న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు. చర్మం, వెంట్రుకల నిర్మాణం, వాటి బలానికి కారణమయ్యే కొల్లాజన్ ను ఫైబ్రోబ్లాస్ట్ కణాలు తయారుచేస్తాయి. ఈ కణాల మీద ఎలుకల్లో ఒక స్టడీ జరిగింది. దీనిలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. గాయమైన చోట వెంట్రుకలు మళ్లీ పెరగడానికి ఒక జీవ ప్రక్రియ కారణమవుతుందని ఈ రీసెర్చ్ లో తేలింది.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

వెంట్రుకల పునర్నిర్మాణం

వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది. తలపై గాయం అయినప్పుడు అక్కడ ఈ జీవక్రియ మందగిస్తుంది. అందువల్లనే ఆ భాగంలో వెంట్రుకలు తిరిగి పెరగవు.

READ ALSO : Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

అయితే ఈ జీవక్రియ చురుగ్గా ఉండేలా చేయగలిగితే ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ప్రేరేపితం అవుతాయి. తద్వారా వెంట్రుకల పునర్నిర్మాణం సాధ్యమవుతుందంటున్నారుఇన్వెస్టిగేటర్, సెల్ బయాలజిస్ట్ ప్రొఫెసర్ మయూమిఇటో. ఎలుకలపై చేసిన ఈ ఎక్స్ పరిమెంట్ సక్సెస్ అయింది. నాలుగు వారాల్లో ఎలుకల్లో కొత్త వెంట్రుకలు ఏర్పడ్డాయి. ఈ రీసెర్చ్ మరింత ముందుకు సాగితే బట్టతలకు కూడా మంచి ట్రీట్ మెంట్స్ వచ్చే అవకాశం ఉంది.