Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్‌ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.

Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

hair health

Hair Health : వర్షాకాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్య. ఈ సీజన్ లో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందిన అందువల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. సాధారణంగా ఎండాకాలంలో కనిపిస్తుందని భావించే చుండ్రు, తల పైన దురద వంటి సమస్యలు కూడా ఇప్పుడు పెరుగుతాయి. దీంతో శిరోజాలు ఊడిపోవడానికి దారితీస్తుంది. అంతేగాక, జుట్టు చాలా త్వరగా జిడ్డుగా మారుతుంది. కాబట్టి తరచుగా తలస్నానం చేయాలనుకుంటారు. పదే పదేషాంపూ చేసుకోవటం, తలస్నానం చేయడం వంటివి చేస్తారు. దాంతో జుట్టు ఆరోగ్యం చెడిపోతుంది. తరచుగా కడిగితే జుట్టులోని తేమ, తలపై ఉండే సహజమైన నూనెలు కోల్పోవచ్చు. ఇది జుట్టును నిర్జీవంగా, పొడిబారినట్లు చేస్తుంది. దీంతో జుట్టు చిట్లిపోవడం, వెంట్రుకలు రంగుమారుతాయి. కేశాలు రాలిపోతుంటాయి.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

వర్షాకాలంలో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి శరీరం పట్ల ఎంత శ్రద్ధ పెడతామో, జుట్టు విషయంపై కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది.అదనపు మోతాదులో పోషకాలు అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు పోషణ , బలాన్ని చేకూర్చవచ్చు.అవి విరిగిపోకుండా నిరోధించవచ్చు.

ఆరోగ్యకరమైన శిరోజాల కోసం మంచి ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. విటమిన్ ఎ, సి, డి, ఇ, జింక్, , ఐరన్, బయోటిన్, ప్రొటీన్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

READ ALSO : Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

జుట్టు రాలడాన్ని నివారించడానికి,కేశాలు బాగా పెరగడానికి నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలివే..

  1. పాలకూర

పాలకూరతో చేసే సూప్ తాగడం, పాలకూరను తినడం వల్ల శిరోజాలకు అవసరమైన పోషణ అందుతంది. పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం వంటి మంచి పోషకాలు ఉంటాయి. అందువల్ల జుట్టు ఆరోగ్యానికి పాలకూర అద్భుతమైనది. అందుకే కేశాల కుదుళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, మెరిసేజుట్టునుమెయింటెయిన్ చేయడానికి పాలకూర తింటూ ఉండండి.

  1. కాయధాన్యాలు

పప్పులు, కాయధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా వాటిని మాన్‌సూన్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పప్పులు, కాయధాన్యాలు ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్ వంటి పోషకాలకు నిలయాలు. అవి జుట్టును బలోపేతం చేస్తాయి. రాలిపోయిన జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి ముఖ్యమైన విటమిన్ బి, సిలు కూడా పప్పు ధాన్యాలలో లభిస్తాయి.

READ ALSO :Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోవడం నిజమేనా?

  1. వాల్‌నట్స్‌

వాల్‌నట్ మంచి బ్రెయిన్ ఫుడ్‌గా ఉండటమే కాకుండా జుట్టుకు అద్భుతమైన ఆహారం కూడా. వాల్‌నట్స్‌లోబయోటిన్, బి విటమిన్లు (బి 1, బి 6, బి 9), విటమిన్ ఇ లతో పాటు అనేక ప్రోటీన్లు, మెగ్నీషియం ఉన్నాయి. ఇవన్నీ జుట్టు క్యూటికల్‌లను బలోపేతం చేస్తాయి, తలకు మెరుగైన పోషణను అందిస్తాయి.

  1. పెరుగు

పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్‌ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు. కేవలం తినడమే కాకుండా పెరుగును గుడ్లు, తేనె లేదా నిమ్మకాయతో కలిపి జుట్టుకు పట్టించి మర్దన చేస్తే బయట నుంచి పోషణ అందించవచ్చు.

READ ALSO : Ginger For Healthy Hair : ఆరోగ్యకరమైన జుట్టు కోసం అల్లం ! జుట్టు పెరుగుదలలో దాని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

  1. ఓట్స్

ఆహారంలో పీచుతో కూడిన ధాన్యాలను చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి చాలా విధాల మేలు చేస్తాయి. అదనంగా ఓట్స్‌లో మీ జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీఅన్‌శాచురేటెడ్ఫ్యాటీ యాసిడ్స్ (ప్యూఫా) పుష్కలంగా ఉన్నాయి.

  1. స్ట్రాబెర్రీలు

హెయిర్హెల్దీకిటేస్టీసూపర్‌ఫుడ్‌ల జాబితాలో స్ట్రాబెర్రీలు కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో అధిక స్థాయిలో సిలికాన్ ఉంటుంది. జుట్టు బలానికి, జుట్టు పెరుగుదలకు సిలికాన్ ఒక ముఖ్యమైన మినరల్.

READ ALSO : Benefits Of Niacinamide : జుట్టు ఆరోగ్యానికి నియాసినామైడ్ తో అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?

  1. చిలగడదుంప

పొడిబారిన, నిస్తేజమైన జుట్టుకు జీవం పోయాలంటే జుట్టుకు బీటా కెరోటిన్ అవసరం. ఈ పోషకం చిలగడదుంపలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో చిలగడదుంపలు తినండి. వీటిలోని పోషకాలు మీ తలలో గ్రంథులను ప్రేరేపిస్తుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.