Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు

పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరిపై సాగుచేస్తున్నారు రైతు మస్తాన్. కూలీల సమస్య ఉండటంతో.. పెట్టుబడి ఎక్కువైనా.. డ్రిప్, మల్చింగ్ విధానంలో సాగుచేస్తున్నారు. సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన  అధిక దిగుబడి వస్తోంది.

Bitter Gourd Cultivation

Bitter Gourd Cultivation : కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. మార్కెట్ కు అనుగుణంగా పంటల సాగు చేపడితే లాభాలను గడింవచ్చు. ఇందుకు నిదర్శనమే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన రైతు మస్తాన్. తనకున్న 3 ఎకరాల్లో ఒక ఎకరంలో నిలువు పందిర్లను ఏర్పాటు చేసుకొని, రెండేళ్లుగా తీగజాతి పంట అయిన కాకరను సాగుచేస్తున్నారు.

READ ALSO : Pandiri Kaakara: పందిరి కాకర సాగుతో అధిక లాభాలు..!

ఏడాది పొడవునా, నాణ్యమైన దిగుబడిని తీస్తూ,  నిరంతరంగా  ఆదాయాన్ని పొందుతున్నారు. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్‌ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా ఉంది. అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా , దొరవారిసత్రం మండలం, కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన రైతు మస్తాన్ కాకరను సాగుచేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు.

పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరిపై సాగుచేస్తున్నారు రైతు మస్తాన్. కూలీల సమస్య ఉండటంతో.. పెట్టుబడి ఎక్కువైనా.. డ్రిప్, మల్చింగ్ విధానంలో సాగుచేస్తున్నారు. సాగునీటితో పాటు సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన  అధిక దిగుబడి వస్తోంది.

READ ALSO : కాక‌ర కాయ జ్యూస్‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ..

నిలువు పందిరి విధానంలో సాగుచేయడం వల్ల, పంట కోత కూడా సులభంగా ఉంది. వచ్చిన దిగుబడిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తరలిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.