Boda Kakarakaya Cultivation
Boda Kakarakaya Cultivation : కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో సహజంగా పండే ఈ తీగజాతి పంటకు.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. కిలో బోడకాకరకు రూ.100 నుండి 200 ధర పలుకుతోంది. ప్రస్తుతం చాలా మంది రైతులు చిన్న చిన్న కమతాల్లో సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నారు.
READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !
కూరగాయల్లో రారాజు బోడ కాకర అంటే అతిశయోక్తి కాదు. ధరలోనూ ఇదే కింగ్. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి మరీ కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిని సాగు చేసిన రైతులందరూ అధిక లాభాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లా, ముక్కాల మండలం, రేంజర్ల గ్రామనికి చెందిన కొంత మంది రైతులు బోడకాకరను సాగుచేస్తూ.. లాభాలు గడిస్తున్నారు.
READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం
గతంలో సంప్రదాయ పంటలైన పసుపు , వరి పంటలను పండించేవారు. అయితే ఈ పంటల్లో పెట్టుబడి పెరగడమే కాకుండా శ్రమ అధికంగా ఉండేది. అంత చేసినా.. దిగుబడులు పెరగకపోవడం.. ఇటు లాభాలు కూడా వచ్చేది కాదు. దీంతో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని నిచ్చయించుకొని గత ఏడాది నుండి బోడ కాకరను ఎత్తుమడులపై మల్చింగ్ వేసి, స్టేకింగ్ విధానంలో అర ఎకరంలో సాగుచేస్తున్నారు రైతు జంగం భూమన్న. నాటిన రెండో నెల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. అలా నాలుగు నెలల పాటు దిగుబడి వస్తుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి కిలో రూ.100 నుంచి రూ.200 వరకూ పలుకుతుంది.
READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!
అధిక మొత్తంలో దిగుబడి వచ్చే బోడకా కరలో పోషకాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఈ పంట సాగుకు పెట్టుబడి అధికం. అయితే ఒక్కసారి పెడితే నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. అందుకే దీనికి ఆదరణ ఎక్కువ. రేంజర్ల గ్రామంలో దీని సాగు పెరుగుతోంది.
ఇటీవల కాలంలో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూరగాయ పంటల సాగు పెరిగింది. అయితే పందిళ్లు, స్టేకింగ్ వేసుకునేందుకు ఉద్యాన శాఖ సబ్సిడీలు అందిస్తే.. కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.